జనవరి 19న కొల్ కత్తాలో బీజేపీయేతర పార్టీల బహిరంగసభ

Share Icons:

కొత్త ఢిల్లీ, జనవరి 9,

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దేశ రాజధాని ఢిల్లీ పర్యటనాకు వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. డిసెంబర్‌లో జరిగిన మహాకూటమి సమావేశానికి కొనసాగింపుగా భవిష్యత్‌ కార్యాచరణపై నేతలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు మరో ఐదారుగురు నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మహాకూటమి చేపట్టనున్న దేశ వ్యాప్త కార్యక్రమాలపై చంద్రబాబు చర్చించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు.

బీజేపీ వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబర్‌ 9న ఢిల్లీలో సుమారు 28 రాజకీయ పార్టీలతో జరిగిన భేటీకి కొనసాగింపుగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు. రాహుల్‌తో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ నెల 19న కోల్‌కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై నేతలతో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఎజెండాను పూర్తిస్థాయిలో ఖరారు చేసే లక్ష్యంతో చంద్రబాబు దిల్లీ పర్యటనకు వెళ్లినట్టు సమాచారం.

భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి? జనవరి 19 తర్వాత ఎక్కడ ఎలాంటి సమావేశాలు పెట్టాలి? ఎవరు ఎక్కడ హాజరు కావాలి? ఆయా చోట్ల ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలేమిటి? తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. జాతీయ నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు తెదేపా ఎంపీలతో సమావేశం కానున్నారు. మరో పక్క రాహుల్ గాంధీతో భేటీలో, రాష్ట్ర సమస్యలు కూడా చంద్రబాబు ప్రస్తావించే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ, నమ్మించి మోసం చెయ్యటం, విభజన చట్టంలో ఉన్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఉండటం, ప్రత్యేక హోదా ఇవ్వను అని తేల్చి చెప్పటంతో, ఈ విషయం పై కూడా ఏపికి జరిగిన అన్యాయాన్ని, జాతీయ స్థాయిలో చర్చకు పెట్టారు.

మామాట: ఇల్లు చక్కబెట్టకుండా.. ఊరు వెళగబెడతారట… 

Leave a Reply