బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్: నామినేషన్ లో అందరూ…

nomination process in big boss house...all members in nominations
Share Icons:

హైదరాబాద్: సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటిలో మిగిలిన ఏడుగురు సభ్యులని నామినేషన్లో పెట్టాడు. మొదట ఎప్పటిలాగానే ఈ వారం నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా ‘టాపర్ ఆఫ్ ది హౌస్’ అనే టాస్క్ ఇచ్చాడు. టాస్క్ ప్రకారం ఏడుగురు ఇంటి సభ్యులకు లాటరీ పద్దతిలో నెంబర్లు కేటాయించారు. ఆ నెంబర్ల ప్రకారం ఇంటి సభ్యులు ఆయా స్థానాల్లో నిలబడాలి. ఇందులో 4 నుంచి 7వ స్థానాల్లో ఉన్నవారు నామినేట్ అవుతారు. అయితే నామినేషన్ లో ఉన్నవారు టాప్3లో ఉన్నవారితో వాదించి, వారికంటే తామే బెటర్ అని చెప్పి, ఆ స్థానాలని దక్కించుకోవాలి.

ఇక టాప్3 లో ఉన్నవారు కూడా తాము  బెటర్ అని చెప్పుకోవాలి. టాస్క్ మొదలవ్వడమే లాటరీ పద్దతిలో వచ్చిన నెంబర్ల ప్రకారం బాబా భాస్కర్-1, రాహుల్-2, వరుణ్-3,అలీ-4, శివజ్యోతి-5, వితికా-6, శ్రీముఖి-7 స్థానాల్లో నిలబడ్డారు. దీంతో చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు, టాప్3లో వారితో చర్చలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో 6వ స్థానంలో ఉన్న వితికా టాప్3లో ఉన్నవారితో చర్చ మొదలుపెట్టింది. అయితే మీకంటే నేనే బెటర్ అనే చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ వితికా వాదనతో బాబా, రాహుల్ లు ఏకీభవించలేదు.

దీంతో లాభం లేదని చెప్పి వరుణ్ తో వాదించింది. ఇక వరుణ్ కరిగిపోయి భార్య కోసం తన 3వ స్థానం ఇచ్చేసి, తాను 6వ స్థానంలోకి వెళ్ళాడు. తర్వాత శ్రీముఖి వచ్చి రాహుల్ తో వాదించింది. తనకంటే నువ్ ఎందులో బెటారో చెప్పాలని రాహుల్ ని డిమాండ్ చేసింది. రాహుల్ కూడా నువ్ ఎందులో బెటారో చెప్పాలంటూ వాగ్వాదానికి దిగాడు. ఇలా వీరిద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకోవడంతో, శ్రీముఖి వేస్ట్ అనుకుని బాబాతో చర్చించింది.

అయితే బాబా శ్రీముఖినే తనకంటే బెటర్ అని చెప్పి….శ్రీముఖికు 1వ నెంబర్ ఇచ్చేసి..తాను 7వ స్థానంలోకి వెళ్ళాడు. తర్వాత అలీ.. 2వ నెంబర్లోకి రాగా, రాహుల్ 4వ స్థానంలోకి వెళ్ళాడు. చివరికి శివజ్యోతి 3వ నెంబర్లో ఉన్న వితికాతో వాదించింది. అలాగే నెంబర్ 3 స్థానాన్ని వరుణ్ తన భార్యకు త్యాగం చేయడంతో శివజ్యోతి ఫైర్ అయింది. గేమ్‌ని గేమ్‌లా ఆడకుండా వితికా కోసం మూడో స్థానం ఎలా ఇస్తావ్ అంటూ వరుణ్‌ని ప్రశ్నించింది. ఈ ముగ్గురి మధ్య చర్చ ముదిరి వాదనగా మారడంతో ఒకర్నొకరు దూషించుకున్నారు. మొత్తానికి వీరి చర్చ ఓ కొలిక్కి రాకపోవడంతో బిగ్ బాస్ ఏడుగురు సభ్యులని నామినేషన్ లో పెట్టాడు. మరి చూడాలి ఈ వారం వీరిలో ఎవరు ఇంటి నుంచి బయటకెళతారో.

Leave a Reply