త్వరలో విడుదల కానున్న నోకియా 3.1ఎ, 3.1సి

Share Icons:

ముంబై, 10 జూన్:

ప్రముఖ మొబైల్స్ తయారీదారు హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన నోకియా స్మార్ట్‌ఫోన్లు.. నోకియా 3.1ఎ, 3.1సి లను త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్ల ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

అయితే వీటిల్లో ఒకే ఫీచర్లను ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ రెండు ఫోన్లు భిన్న కలర్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి. నోకియా 3.1ఎ బ్లాక్ కలర్‌లో విడుదల కానుండగా.. నోకియా 3.1 సి వైట్ కలర్ ఆప్షన్‌లో లభ్యం కానుంది. 

నోకియా 3.1ఎ/3.1సి ఫీచర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై.

 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ.

Leave a Reply