నోకియా స్మార్ట్‌టీవీ అదిరిపోయే ఫీచర్లు….ధర ఎంతటే?

nokia released 55k inches 4k ultra smart tv....
Share Icons:

ముంబై: వినియోగదారులని ఆకట్టుకోవడానికి నోకియా తన స్మార్ట్ టీవీలని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, మొబైల్స్ తయారీదారు నోకియాలు సంయుక్తంగా తయారుచేసిన నోకియా 55 ఇంచుల 4కె స్మార్ట్‌టీవీ తాజాగా భారత్‌లో విడుదలైంది. నోకియా స్మార్ట్‌టీవీని వినియోగదారులు రూ.41,999 ధరకు డిసెంబర్ 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ టీవిని భారత్‌లోనే తయారుచేశారు. కాగా ఇందులో 55 ఇంచుల 4కె అల్ట్రాహెచ్‌డీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే డాల్బీ విజన్, 24 వాట్ల స్పీకర్లు, డీటీఎస్ సరౌండ్ సౌండ్, డాల్బీ ఆడియో తదితర ఇతర ఫీచర్లను కూడా ఈ టీవీలో అందిస్తున్నారు. ఇక ఆడియోకు సంబంధించి జేబీఎల్‌కు చెందిన టెక్నాలజీని ఈ టీవీలో ఏర్పాటు చేసినందున ఆడియో అవుట్‌పుట్ క్వాలిటీని కలిగి ఉంటుంది.

కాగా ఈ టీవీలో ఆండ్రాయిడ్ 9.0, 1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2.5జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్, హెచ్‌డీఎంఐ ఏఆర్‌సీ తదితర ఇతర ఫీచర్లను అందిస్తున్నారు. ఇక లాంచింగ్ సందర్భంగా ఈ టీవీని ఏ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేసినా 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అలాగే ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.999లకే ఈ టీవీకి 3 ఏళ్ల పాటు అదనపు వారంటీని అందివ్వనున్నారు.

హువావే కొత్త స్మార్ట్‌వాచ్

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌వాచ్.. వాచ్ జీటీ2ను ఇవాళ భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 1.2 ఇంచుల అమోలెడ్ టచ్ డిస్‌ప్లే, హువావే కైరిన్ ఎ1 చిప్, బ్లూటూత్ 5.1, వాటర్ రెసిస్టెన్స్, జీపీఎస్, ఇంటిగ్రేటెడ్ మైక్రోఫోన్ అండ్ స్పీకర్, బ్లూటూత్ కాలింగ్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, 15 వర్కవుట్ మోడ్స్, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.15,990 ప్రారంభ ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

Leave a Reply