బంపర్ ఆఫర్: రూ 10 వేలు తగ్గిన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్

nokia 6.1 smartphone price cut in india
Share Icons:

ముంబై:

 

‘హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్ పై బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ ఫోన్ కు సంబంధించిన ధరను భారీగా తగ్గించింది. నోకియా 6.1 ఫోన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,999 ఉండగా, ఇప్పుడీ వేరియెంట్ ధర రూ.10వేలు తగ్గింది. దీంతో దీన్ని రూ.6,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

ఇక ఇదే ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,999 ఉండగా దీన్ని రూ.9వేలు తగ్గించారు. దీంతో ఈ వేరియెంట్‌ను ప్రస్తుతం రూ.9,999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

 

నోకియా 6.1 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 ఇంచ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

ఇక శాంసంగ్ కంపెనీ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ (2019)ను తాజాగా విడుదల చేసింది. రూ.10,860 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు ఈ నెల 12వ తేదీ నుంచి లభ్యం కానుంది.

 

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 (2019) ఫీచర్లు…

 

8 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, బ్లూటూత్ 4.2, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.

Leave a Reply