నోకియా 2.2  వచ్చేసింది…

HMD Global Nokia 3.1 smartphone released
Share Icons:

ఢిల్లీ, 7 జూన్:

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 2.2ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక బటన్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999 ఉండగా, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.7,999గా ఉంది. ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే ఈ ధరల కింద ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైన లేటెస్ట్ నోకియా స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.

నోకియా 2.2 ఫీచర్లు…

5.71 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై.

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Leave a Reply