TRENDING NOW

సైన్యంలో నో ‘గే’ స్

సైన్యంలో నో ‘గే’ స్
కొత్తఢిల్లీ, జనవరి 10,

భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్వలింగ సంపర్కులపై  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీలోకి గే (స్వలింగ సంపర్కులు)లను అనుమతించలేమని కుండబద్దలు కొట్టారు. భారత సైనిక దళం సంప్రదాయకమైందని.. అందులోకి స్వలింగ సంపర్కలను అనుమతించమని  అన్నారు.

ఇటీవల సుప్రీం కోర్టు గే సెక్స్ కి అనుకూలంగా తీర్పు  ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ వద్ద ప్రస్తావించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. భారత సైన్యంలోకి వ్యభిచారులను, స్వలింగ సంపర్కులను అనుమతించడం సాధ్యం కాదన్నారు. స్వలింగ సంపర్కం లాంటివి ఆర్మీలో కుదరవన్నారు. సుప్రీం తీర్పు తరువాతి పరిణామాలు  సైనిక చట్టాలకు అతీతం కాదని, అయితే.. రాజ్యాంగం సైన్యానికి కొంత స్వాతంత్య్రాన్ని ఇచ్చిందని చెప్పారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

మామాట: కోర్టులతో పాటూ మీరూ మారండి సారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: