శ్రీశాంత్‌కి షాకిచ్చిన సుప్రీం..

No County cricket for Sreesanth as Supreme Court asks Delhi HC
Share Icons:

న్యూఢిల్లీ, 16 మే:

మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడి గత ఐదు ఏళ్లుగా నిషేధం ఎదురుకుంటున్న కేరళ క్రికెటర్ శ్రీశాంత్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది.

ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడేందుకు అనుమతించాలంటూ అతను దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం కోర్టు విచారణకు తిరస్కరించింది.

స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌తో సహా ఇతర ఆటగాళ్ల సంగతిని జూలైలోగా తేల్చాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది.

అయితే మళ్లీ క్రికెట్ ఆడాలన్న శ్రీశాంత్ తపనను తాము అర్థం చేసుకుంటామని, కానీ హైకోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందేనని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.

కాగా, 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరో 33 మందిపై అభియోగాలు మోపారు. దీంతో బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. అలాగే ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని అతడు పెట్టుకొన్న అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించింది. ఇక ఇదే విషయాన్ని గ‌తంలో కేరళ హైకోర్టుకు బీసీసీఐ తెలియజేసింది. అంతేకాదు స్కాటిష్ క్రికెట్ లీగ్ ఆడేందుకు అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేమని తెలిపింది.

మామాట: ఒక తప్పు..జీవితమే మారిపోయింది….

Leave a Reply