నిజాం టిఫన్ డబ్బా దొరికింది

Share Icons:

హైదరాబాద్, సెప్టెంబర్ 11:

చారిత్రక నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు మహమ్మద్ గౌస్ భాషా, మహమ్మద్ ముబీన్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరూ ముంబయిలోని ఓ రహస్య ప్రాంతంలో ఉండగా నిన్న అర్ధరాత్రి హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్‌ వాసులేనని సమాచారం. వీరి వద్ద నుంచి చోరీకి గురైన విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మ్యూజియం నుంచి వీరు అత్యంత విలువైన బంగారు టిఫిన్‌ బాక్స్‌, టీ కప్పు, సాసర్‌, బంగారు చెంచాను ఎత్తుకెళ్లారు. కేసుకు సంబంధించి అధికారిక వివరాలు పోలీసులు ఈరోజు వెల్లడించారు. కాగా నిందితులను గుర్తించడానికి 15 బృందాలు ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ అంజని కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 3 వ తేదీ రాత్రి నిందితులు హైదరాబాద్ 7వ నవాబ్ మనవడు నవాబ్ నజీఫ్ ఆలీ ఖాన్ కి చెందిన మ్యూజియంలో విలువైన బంగారు వస్తువులను అపహరించిన విషయం తెలిసిందే.

మామాట: ఇంతకీ రికవరీ చేసింది అసలా, నకిలీదా… స్వామీ

Leave a Reply