కులం అడిగితే కొడతా అంటున్న గడ్కరీ…

Nitin gadkari said a shocking news to telangana
Share Icons:

నాగ్‌పూర్, 11 ఫిబ్రవరి:

ఈ మధ్య కేంద్రమంత్రి నితిన్ గడ్కరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కుటుంబాన్ని సంరక్షించుకోలేని వారు…దేశాన్ని ఏం కాపాడతారంటూ మాట్లాడినా విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీని ఉద్దేశించే మాట్లాడారని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా గడ్కరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఎవరైనా కులం గురించి మాట్లాడితే వారితే కొడతానని హెచ్చరించారు. తాజాగా పుణేలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని, కుల, వర్గ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నాగపూర్ ప్రాంతంలో ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదని చెప్పారు. ఎందుకంటే ఎవరైనా కులం గురించి మాట్లాడితే నా చేతిలో చావు దెబ్బలు తింటారని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు సాయం చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడంతోనే సమానమని, ఒకరిది ఎక్కువ కులం.. మరొకరిది తక్కువ కులం అనే భేదం తొలగిపోవాలని కోరుకున్నారు.

మామాట: మంచి మాటలే చెప్పారు…

 

Leave a Reply