నిస్సాన్ మోటార్ చైర్మన్ కార్లోస్ ఘోస్న్  అరెస్ట్

Share Icons:
కొత్త ఢిల్లీ, నవంబర్ 20 ,
జపాన్‌కు చెందిన దిగ్గజ కార్ల సంస్థ నిస్సాన్ మోటార్ చైర్మన్ కార్లోస్ ఘోస్న్ అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. సంస్థ సొమ్మును సొంత అవసరాలకు ఆయన వాడుకోవడమేకాక, తన ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో అవినీతి నిరోధక అధికారులు ఆయనను అరెస్టు చేశారు. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీ సెక్యూరిటీస్‌ నివేదికల్లో తప్పుడు లెక్కలు చూపించి కార్లోస్ తన ఆదాయాన్ని తక్కువగా ప్రకటించారని నిస్సాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని నెలల క్రితం కార్లోస్‌తోపాటు రిప్రజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీపై దర్యాప్తు చేశామని, ఇందులో వీరి అవినీతి బయటపడిందని నిస్సాన్ వెల్లడించింది.
కార్లొస్.. రెనాల్ట్, నిస్సాన్, మిట్సుబిషి జాయింట్ వెంచర్‌కూ నేతృత్వం వహిస్తున్నారు. అయితే తాజా పరిణామాలతో సంస్థల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే వీలుంది. అదుపులోకి తీసుకున్న కార్లోస్‌ను టోక్యో ప్రాసిక్యూటర్లు విచారిస్తున్నారు. కార్లోస్‌ అరెస్టు జపాన్‌‌లో సంచలనంగా మారింది. కార్లోస్‌కు ఎగ్జిక్యూటివ్‌గా మంచి పేరుంది. దివాలా దశలోని నిస్సాన్‌ కంపెనీని ఉత్తమ సంస్థగా ఆయన అభివృద్ధి చేశారు. కార్లోస్ అరెస్టుతో విదేశాల్లోని ఆ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు కార్లోస్‌, గ్రూప్ డైరెక్టర్ గ్రెగ్‌ కెల్లీని నిస్సాన్ సంస్థ పదవుల నుంచి తొలగించింది.
మామాట: మరి ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా… దర్జాగా చేతులూపుకుంటూ తిరుగుతారు. 

Leave a Reply