అలవోకగా లక్ష్యాన్ని చేధించిన కివీస్…

Share Icons:

హామిల్ట‌న్, 31 జనవరి:

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగ‌వ వ‌న్డేలో టీమిండియా చెత్తగా ఆడి ఓడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌.. టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే సిరీస్ గెలిచి.. జోరుమీదున్న భార‌త్‌కు అనుకున్నంత‌గా ఆరంభం ల‌భించ‌లేదు. బౌల్ట్ జోరుకు భార‌త్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్లను కోల్పోయింది. దీంతో ఇండియా కేవ‌లం 30.5 ఓవ‌ర్ల‌లో 92 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

ఇక 93 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడారు. ఓపెనర్ గుప్తిల్ 4 బంతుల్లో 14 పరుగులు చేసి భువనేశ్వర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విలియంసన్‌ని కూడా భువి ఔట్ చేశాడు. ఇక మరో ఓపెనర్ నికోలస్ 30, టేలర్ 37‌లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించారు. ఐదు వికెట్లు తీసి భారత్‌ని చావుదెబ్బ కొట్టిన బౌల్ట్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

ఇక ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో వన్డే ఆదివారం వెల్లింగ్‌టన్‌లో జరగనుంది.

మామాట: ఇప్పుడు జట్టులో ఉన్న లోపాలు ఏంటో తెలుస్తాయిలే

Leave a Reply