కొత్త సంవత్సరానికి ముందుగానే స్వాగతం

Share Icons:
వెల్లింగ్టన్, డిసెంబర్ 31,
న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి అందరి కన్నా ముందుగానే స్వాగతం పలికారు. 2019కి ఆదేశ ప్రజలు ఘన స్వాగతం చెప్పుకున్నారు. కొత్త సంవత్సరంలోకి ఈ దేశ ప్రజలు ప్రథమంగా అడుగుపెట్టారు. 2019కి మొదటగా కిరీట్‌మటి, సమోవా, న్యూజిలాండ్ ఆహ్వానం పలికాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్, వెల్లింగ్టన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కళ్లు చెదిరే బాణ సంచాతో ఆక్లాండ్ సిటీ మిరుమిట్లు గొలుపుతున్నాయి.  న్యూఇయర్ వేడుకలను మొదటగా జరుపుకునేది సమోవా దేశం. సుమారు 2 లక్షల జనాభా ఉన్న దేశం అది. మనకంటే ఎనిమిదిన్నర గంటలు ముందుంటారు వారు.
క్రిబాటీ అనే దేశం ఉంది. ఆ దేశంలో క్రిస్మస్ అనే ద్వీపం ఉంది. అక్కడ కూడా మనకంటే ఎనిమిదిన్నర గంటల ముందే నూతన సంవత్సరం వేడుకలు జరుగుతాయి. ఆ తరువాత గంటకు గానీ న్యూజిలాండ్ ప్రజలకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే అవకాశం రాదు. అందరూ న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతారనుకోవడానికి లేదు. ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం మనకంటే ఐదున్నర గంటలు ముందుంటుంది. భారత్‌కంటే 30 నిమిషాలు ఆలస్యంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఇరాన్, ఇరాక్, గ్రీస్, జర్మనీ దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు నిమిషాల తేడాతో జరుగుతాయి.
కాస్త ఆలస్యమైనా ఒక్కోచోటా ఒక్కోలా కలర్‌ఫుల్ ఈవెంట్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు.ఇండోనేషియా, బ్యాంకాక్, హనోయ్, థాయ్‌లాండ్ దేశాలు ఒకే సమయంలో న్యూఇయర్‌లో అడుగుపెడతాయి. కళ్లు చెదిరేలా కలర్‌ఫుల్ వేడుకలను నిర్వహిస్తారు. వీళ్ల తరువాత మయన్మార్, మడ్లి, కొకోస్, ఐస్లాండ్ దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి.
మామాట:  భౌగోళికంగా అది వారికి ఉన్న ఓ అవకాశం… 

Leave a Reply