TRENDING NOW

వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన పాక్ ఓపెనర్లు….

వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన పాక్ ఓపెనర్లు….

జింబాబ్వే, 20 జూలై:

జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్థాన్ ఓపెనర్లు పరుగుల వరద పారించారు. బులవాయో వేదికగా జరిగిన  మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్(210 నాటౌట్: 156 బంతుల్లో) ఆకాశే హద్దుగా చెలరేగాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌లో 24ఫోర్లు, 5సిక్సర్లు ఉండటం విశేషం. అలాగే మరో ఓపెనర్ 122 బంతుల్లో 113 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌తో వన్డేల్లో మరో రికార్డు నమోదైంది. గతంలో శ్రీలంక ఓపెనర్లు సనత్ జయసూర్య-ఉపుల్ తరంగ కలిసి నెలకొల్పిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యాన్ని జమాన్-ఇమాముల్ హక్‌లు బద్దలుగొట్టారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 304 పరుగులు చేశారు.

Life Homepathy
treefurn AD

అలాగే పాకిస్థాన్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో భారత్‌పై సయిద్ అన్వర్ చేసిన 194 పరుగులే అత్యధికం. మొత్తంగా డబుల్ సెంచరీ సాధించిన ఆరో ఆటగాడిగా జమాన్ అరుదైన ఘనత అందుకున్నాడు.

ఆరంభం నుంచి పాక్ ఓపెనర్లు టి20 తరహాలోనే బ్యాటింగ్ చేశారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన పాక్‌ను కట్టడి చేసేందుకు జింబాబ్వే బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. చివరికి 42వ ఓవర్‌లో సీనియర్ బౌలర్ మసకద్జ బౌలింగ్‌లో ఇమామ్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ వేగంగా ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 50 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత 50 ఓవర్లలో పాక్ వికెట్ నష్టానికి 399 పరుగులు చేసింది. ప్రస్తుతం జింబాబ్వే 19 ఓవర్లలో 65/5 పరుగులు చేసి ఓటమి అంచుల్లో ఉంది.

మామాట: పసికూనల మీద ప్రతాపం బాగానే చూపించారు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: