కుండలు పగలగొట్టేశారు: రివెంజ్ తీర్చుకున్నారు…

new task of big boss house mates break the pot
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు అదిరిపోయే టాస్క్ ఇచ్చారు. ఒక సభ్యుని గురించి మిగతా సభ్యులు ఏమనుకున్నారో ఒక వీడియో వేసే చూపించి వారి రివెంజ్ తీర్చుకునేలా ఒక టాస్క్ ఇచ్చారు. ‘టాస్క్ హంట్ అండ్ హిట్‌’ పేరిట ఇచ్చిన టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో జరిగే గుసగుసల్ని బహిర్గతం చేశారు. మూడు రౌండ్లుగా జరిగే ఈ టాస్క్‌లో తొలి రౌండ్‌లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక బూత్ ఏర్పాటు చేసి.. అందులో ప్రతి ఇంటి సభ్యుడికి సంబంధించి మిగతా సభ్యులు ఏం మాట్లాడుకున్నారో ఓ ముఖ్యమైన వీడియోను ప్లే చేసి చూపించారు.

తర్వాత ఆ వీడియోలు ఉన్న వ్యక్తితో మాట్లాడి… తరువాత తమ గురించి మాట్లాడిన వ్యక్తి ఫొటోను కుండకు అంటించి ఆ కుండను దిష్టిబొమ్మకు పెట్టి కర్రతో ఆ కుండను పగలగొట్టాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో భాగం మొదట బాబా భాస్కర్ తన గురించి హౌస్‌లో రాహుల్, వరుణ్, వితికా, మహేష్, అలీలు ఏం అనుకుంటున్నారో సీక్రెట్‌గా బూత్‌లో చూపించారు. దీంతో బాబా అలీ, రాహుల్ లని పిలిచి మాట్లాడి, తన గురించి ఏమనుకున్నారో వివరించారు. అనంతరం అలీ అన్న మాటలకు ఎక్కువ హార్ట్ అయ్యి..అతని ఫొటోని దిష్టిబొమ్మకు పెట్టి ఫట్ మని పగలగొట్టేసి కసి తీర్చుకున్నారు.

ఇక నెక్స్ట్ శ్రీముఖి వెళ్ళగా…. తన గురించి అలీ, శివజ్యోతి, మహేష్ విట్టాలు నెటిటివ్‌గా మాట్లాడిన విషయాలను విని వాళ్లతో సీరియస్‌గా చర్చించింది. చివరికి మహేష్ ని టార్గెట్ చేసుకుని అతని బొమ్మ ఉన్న కుండని పగలగొట్టింది. అనంతరం మహేష్ వంతు వచ్చింది. అతని గురించి శ్రీముఖి నెగిటివ్ గా మాట్లాడింది. దీంతో  మహేష్ శ్రీముఖి తల ఉన్న కుండను పగలగొట్టి రివేంజ్ తీర్చుకున్నాడు. వరుసగా శివజ్యోతి.. రాహుల్ ఫొటో ఉన్న కుండను, వరుణ్- వితికాలు అలీ కుండను, రాహుల్.. మహేష్ విట్టా ఫొటో ఉన్న కుండను, అలీ.. శ్రీముఖి ఫొటో ఉన్న కుండను పగలగొట్టి బిగ్ బాస్ హౌస్‌లో ఒకరి ముందు ఒకరు ‘కుండ’ బద్దలుకొట్టేసుకున్నారు.

అయితే బిగ్ బాస్ బర్త్ డే సందర్భంగా వింత వింత వేషాలతో ఇంటిలో వేడుకలు నిర్వహించారు. ఇది కూడా ఒక టాస్కే అని బిగ్ బాస్ ఆదేశించడంతో కంటెస్టెంట్స్ చెలరేగిపోయారు. ఇక బిగ్ పెద్ద పెద్ద కేక్‌లను పంపించి కేక్ ఫెస్టివల్ చేసుకునేలా చేశారు. అయితే మొదటి కేక్‌ని ఆవురావురుమంటూ లాగించేసి.. తరువాత కేక్ అంటేనే బెంబేలెత్తేలా చేశారు.

 

Leave a Reply