యాత్ర నుండి రాజ‌న్న నిన్నాప‌గ‌ల‌రా సాంగ్…

Share Icons:

హైదరాబాద్, 2 జనవరి:

జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పేద‌ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని నేరుగా విన‌టానికి మెద‌లు పెట్ట‌ని పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌న్ని తీసుకుని యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అండ్ డైలాగ్ టీజ‌ర్ల‌తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఇప్పుడు రాజ‌న్నా నిన్నాప‌గ‌ల‌రా అంటూ సాగే రెండ‌వ సింగిల్ తో ఆయ‌న పాద‌య‌త్ర వ‌ల‌న ప్ర‌జ‌ల ఆనందాన్ని చూపించారు.. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నికులు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు.

మామాట: మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి…

Leave a Reply