త్వరలో వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు…

Share Icons:

ముంబయి, 14 జనవరి:

ప్ర‌ముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొన్ని సరికొత్త ఫీచర్లు రానున్నాయి. అందులో ఒకటి ఫింగ‌ర్ ప్రింట్ అథెంటికేష‌న్ ఫీచర్… ఈ ఫీచ‌ర్ స‌హాయంతో యూజ‌ర్లు త‌మ వాట్సాప్‌కు పిన్‌, ప్యాట్ర‌న్‌, పాస్‌కోడ్‌, ఫేస్ ఐడీ, ట‌చ్ ఐడీ, ఫింగ‌ర్ ప్రింట్ లాక్ ల‌లో ఏదైనా లాక్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో వాట్సాప్ ఓపెన్ అవ్వాలంటే అదే లాక్ వాడాల్సి ఉంటుంది. ఈ ఫీచ‌ర్ వ‌ల్ల ఒక యూజ‌ర్ వాట్సాప్ అకౌంట్‌ను మ‌రొక యూజ‌ర్ వాడ‌లేరు.

అయితే ఈ ఫీచ‌ర్ ఇప్ప‌టికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్ బీటాను వాడుతున్న యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వచ్చింది. ఇక త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ ల‌భ్యం కానుంది.

అలాగే వాట్సాప్‌లో మరో ఫీచ‌ర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దాని స‌హాయంతో యూజ‌ర్లు తాము పంపాల‌నుకునే ఆడియో ఫైల్స్‌ను ముందుగానే విన‌వ‌చ్చు. అలాగే డివైస్‌లో ఉన్న ఆడియో ఫైల్స్ అన్నీ వాట్సాప్‌లో లిస్ట్ అవుతాయి. దీంతో మ‌ల్టిపుల్ ఆడియో ఫైల్స్‌ను కూడా ఒకేసారి పంపుకునే ఫీచ‌ర్‌ను కూడా త్వ‌ర‌లో అందివ్వ‌నున్నారు.

మామాట: ఏ కొత్త ఫీచర్ అయిన యూజర్లకి అనుగుణంగానే….

Leave a Reply