ఏపీలో కొత్త మద్యం పాలసీ: వైన్ షాపుల్లో ఉద్యోగాలు

Share Icons:

అమరావతి:

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇకపై మద్యం షాపులను నిర్వహించనున్నారు. మండలాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించనుంది. అయితే మద్యం షాపుల ఏర్పాటుకు తగిన ప్రదేశాలను బేవరేజెస్ కార్పొరేషన్ గుర్తించనుంది.

 

ఇక ఒక్కో మద్యం షాపు 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. ప్రతి మద్యం దుకాణానికి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నెంబర్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి షాపులో సీసీ కెమెరాలను అమర్చనున్నారు. అటు మద్యం షాపు నిర్వహణ నిమిత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఒక్కో షాపునకు పట్టణ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు సిబ్బందిని నియమిస్తారు.

 

అవి ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగులను నియమించనున్నారు. డిగ్రీ అర్హతతో సూపర్ వైజర్, ఇంటర్ మీడియట్ అర్హతతో సేల్స్ మెన్ ఉద్యోగం ఇస్తారు. సూపర్ వైజర్ కు రూ.17,500, సేల్స్ మెన్లకు రూ.15 వేలు జీతం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలను నిర్వహిస్తారు.

 

Leave a Reply