అమెజాన్‌తో జతకట్టిన యాపిల్…

Share Icons:

ఢిల్లీ, 10 నవంబర్:

ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్‌’తో ప్రముఖ మొబైల్స్ తయారీదారు యాపిల్ కీలక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది. రానున్న హాలిడే షాపింగ్‌ సీజన్‌ దృష్ట్యా తమ మధ్య వైరాన్ని సైతం పక్కన బెట్టి మరీ ఒక  ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ మేరకు నవంబర్ 9న అమెజాన్‌ ఒక ప్రకటన జారీ చేసింది.  రానున్న వారాల్లో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫాంలో విక్రయిస్తామని తెలిపింది. దీని ప్రకారం ఐఫోన్ ఎక్స్‌ఆర్‌, ఎక్స్‌ఎస్‌,  ఎక్స్‌ఎస్‌ మాక్స్‌లాంటి  తాజా యాపిల్ ఉత్పత్తులతో పాటు ఐప్యాడ్‌, యాపిల్‌ వాచ్‌, ఆపిల్‌ టీవీలను అమెజాన్‌ ద్వారా  అందుబాటులోకి తెస్తుంది.

అయితే ఇప్పటివరకు థర్డ్‌పార్టీ సెల్లర్‌గా మాత్రమే యాపిల్‌ ఉత్పత్తులను విక్రయించిన అమెజాన్‌ తాజా ఒప్పందం ప్రకారం నేరుగా వీటిని అమ్మనుంది. దీంతో 2019, జనవరి 4 నుంచి ప్రస్తుతం అమెజాన్లో ఆపిల్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ఇతర కంపెనీలు తమ లిస్టింగ్‌లను తొలగించనున్నాయి.

భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, జర‍్మనీ,  ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో ఐఫోన్లు, ఐప్యాడ్లు తదితర ఆపిల్‌ లేటెస్ట్‌ ఉత‍్పత్తులను విక్రయించనున్నట్టు చెప్పింది. 

మామాట: చైనా మొబైల్ దిగ్గజాల పోటీ తట్టుకోవాలంటే తప్పదు

Leave a Reply