అందినంత దోచుకో… అంద‌కుండా పారిపో

Share Icons:

అందినంత దోచుకో… అంద‌కుండా పారిపో

ఈ సిద్ధాంతం ఒక‌ళ్లో ఇద్ద‌రో కాదు రాజ‌కీయ నాయ‌కుల‌తో, సినిమా న‌టుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉండి వ్యాపార‌వేత్త‌లుగా కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తి బ్యాంకుల్ని ఇత‌ర ఆర్ధిక సంస్థ‌ల్ని నిలువునా ముంచేసే ప్ర‌తివాడూ ఆచ‌రిస్తున్న‌ట్లే క‌నిపిస్తున్న‌ది.

అధికారంలో ఉన్న వారు చేష్ట‌లుడిగి చూస్తుండ‌గా ఆర్ధిక నేర‌స్తులు ఎంచ‌క్కా విమానాలు ఎక్కి విదేశాల‌కు వెళ్లిపోతున్నారు. ఆ త‌ర్వాత రెడ్ కార్న‌ర్ నోటీసు అంటూ ప్ర‌భుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవ‌డం త‌ప్ప ఏం చేయ‌లేక‌పోతున్న‌ది.

ఒక‌టి కాదు రెండు కాదు. ప‌దుల సంఖ్య‌లో ఇలాంటి ఆర్ధిక నేరాలు బ‌య‌ట‌ప‌డుతున్నా మీన‌మేషాలు లెక్కి స్తున్న ప్ర‌భుత్వాన్ని ఏమ‌నాలి?

నేరాన్ని ఆదిలోనే అడ్డుకోలేరా?

నిఘాసంస్థ‌లు హెచ్చ‌రించానా మేలుకోని ఆర్ధిక సంస్థ‌లు, ప్ర‌భుత్వ బాధ్యుల‌కు ఏం శిక్ష వేయాలి?

తాజాగా నీరవ్ మోడీ, అంత‌కు ముందు విజయ్‌ మాల్యా, సంజ‌య్‌ భండారీలాంటి వారంతా అందినంత దోచుకుని విదేశాల‌కు ప‌రారైన వారిలో ప్ర‌ముఖులు. లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా బ్యాంకుల‌కు 9 వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టాడు.

ఆయుధాల వ్యాపారి సంజయ్‌ భండారీ రూ.150 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఆఫ్‌సెట్‌ ఇండియా సొల్యూషన్స్‌ అనే సంస్థ ద్వారా అనేక అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

ఢిల్లీ కోర్టు అతడిని నేరగాడిగా కూడా ప్రకటించింది. కేసులు బిగుస్తున్న సమయంలో నేపాల్‌ మీదుగా దేశం విడిచి పారిపోయాడు.

రూ. వెయ్యి కోట్లకుపైగా ఆస్తుల వివరాలు వెల్లడించకుండా పన్నులు ఎగ్గొట్టిన వ్యక్తి దీపక్‌ తల్వార్‌. ఇతను కార్పొరేట్‌ కంపెనీలకు సలహాదారు. యూపీయే హయాంలో విమానయాన సం స్థలకు ‘ప్రయోజనాలు’ చేకూర్చిపెట్టడం లో కీలకపాత్ర పోషించాడు.

రాజకీయాల్లో పలుకుబడి ఉన్న నేతలు, అధికారులు, పా త్రికేయులతో సంబంధాలున్నాయి.ఐటీ అధికారులు 5 కేసులు పెట్టి లెక్కలు అడిగేసరికి యూఏఈ పారిపోయాడు.

ఐపీఎల్ మ్యాచ్‌ల‌తో డ‌బ్బు, గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి లలిత్‌ మోడీ. 2010లో కొచ్చి టీమ్‌ హక్కుల విషయంలో ఆరోపణలు వచ్చాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చాయి.

అదే సమయంలో ఐపీఎల్‌ చైర్మన్‌ పదవీ ఊడింది. ఈడీ మేలుకొనేలోపే కుటుంబంతో కలిసి ల‌లిత్ మోడీ బ్రిటన్‌ చెక్కేశాడు. ఇతనిపై ఇంటర్‌పోల్‌ బ్లూ కార్నర్‌ నోటీసు జారీ అయ్యింది. ఈడీ చర్యలను లండన్‌ కోర్టులో సవాల్‌ చేశాడు.

బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. తాజాగా నీర‌వ్ మోడీ వ్య‌వ‌హారం కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పి.

ప్ర‌ధాని మోడీ వైపు తిరుగుతున్న వేళ్లు

ప్ర‌ధాని మోడీ హ‌యాంలో దోచుకుని పారిపోతున్నార‌ని ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11 వేల కోట్లకు పైగా ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ వ్యవహారంపై ఒక‌ప్ప‌టి బిజెపి మిత్ర‌ప‌క్ష‌మైన శివసేన కూడా తీవ్రస్థాయిలో స్పందించింది.

ఆయనతో బీజేపీ ఎందుకు అంటకాగాల్సి వచ్చిందో చెప్పాలంటూ దుయ్యబట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ దావోస్ పర్యటన సందర్భంగా అక్కడ జరిగిన కార్యక్రమాల్లో నీరవ్ మోడీ ఎందుకు ఉన్నారని ప్రశ్నించింది. నీరవ్ మోదీ బీజేపీలో భాగమే. ఎన్నికల్లో సైతం ఆయన బీజేపీకి సహాయం చేశారు.

రూ.100, రూ.500 మేర రుణాలను సైతం కట్టలేక ఇక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం భారీ మొత్తంలో సొమ్ములు పట్టుకుని విదేశాలకు పారిపోతున్నారు అని శివ‌సేన త‌న సామ్నా ప‌త్రిక‌లో పేర్కొంది.

యూపీఏ హయంలోనే నీర‌వ్ మోడీ కుంభకోణం చేయ‌డం ప్రారంభించార‌ని బిజెపి ఆరోపిస్తున్న‌ది.

నీరవ్ మోడీ మొత్తం వ్యవహారంలో అసలు పాపం 2011లోనే ప్రారంభ‌మైంద‌ని బిజెపి నాయ‌కురాలు కేంద్ర మంత్రి నిర్మలా శీతారామ‌న్ అంటున్నారు.

ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ అనేది నీరవ్ మోడీ కంపెనీల్లో ఒకటని, అద్వైత్ హోల్డింగ్స్ నుంచి వాళ్లు దీనిని కొనుగోలు చేశారని ఆమె తెలిపారు. 2002 నుంచి అనితా సింఘ్వి ఈ కంపెనీలో వాటాదారుగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

అనితా సింఘ్వి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ సతీమణి కావడం గమనార్హం.

రాహుల్ గాంధీపై కూడా ఆరోప‌ణ‌లు

2013 నుంచి ఎఎస్ఈలో వ్యాపారం చేస్తున్న గీతాంజలి జెమ్స్ అనే కంపెనీని 6 నెలల క్రితమే సస్పెండ్ చేశారనీ… అయితే ఇదే నగల సంస్థ నిర్వహించిన ఓ ప్రమోషనల్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారని నిర్మ‌లా శీతారామ‌న్ అన్నారు.

ఇప్పుడు ఎవ‌రు ఏం చెప్పినా దొంగ‌లు మాత్రం దోచుకుని పారిపోతున్నార‌నేది మాత్రం స‌త్యం. నిత్యం నిజాయితీ గురించి మాట్లాడే ప్ర‌ధాని మోడీ దీనికి ఏం స‌మాధానం చెబుతార‌నేది వేచి చూడాలి.

English Summery: Neerav Modi episode creating trouble to the BJP Government at center. Most of the big fish looting the banks and flying to foreign countries without any hurdles. This questions the morality of BJP Government.

Leave a Reply