నెల్లూరు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరికి 5 కోట్ల కరెన్సీ నోట్లు, 7కోట్ల బంగారు, వెండి బిస్కెట్లతో అలంకరణ!

Share Icons:
  • సింహపురిలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి
  • అమ్మవారి ఆలయానికి దసరా శరన్నవరాత్రి శోభ
  • వివిధ విలువల, రంగుల రూ.5.16 కోట్ల కొత్త కరెన్సీతో తోరణాలు
  • రూ.3.5 కోట్లతో 7 కేజీల బంగారంతో అలంకరణ
  • రూ.3.5కోట్లతో 60 కిలోల వెండితో ముస్తాబు

కోట్ల రూపాయల వివిధ విలువల్లో, రంగుల్లో కొత్త కరెన్సీ తోరణాల రెపరెపలు…  కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు… విద్యుద్దీప కాంతుల నడుమ సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు.

 

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్‌ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు.

ఇందుకోసం మహబూబునగర్‌ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్‌ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్‌ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు.

 

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply