నాణానికి మరో వైపున నెహ్రూ కుటుంబం

Share Icons:

 

ముందు మాట :- రామాయణ మూల రచయిత శ్రీరాముడిని మనకు నాణానికి రెండు వైపులా దర్శింపజేసి రామచరితకు నాయ్యం చేశాడు. రాముడు తన భార్యను శీలపరీక్ష కోరకుండా,అడవులపాలు చేయకుండా వుండివుంటే మనకు ఆయన మరీ మహా మహోత్తముడిగా కనిపించేవాడు. కానీ, వాల్మీకి ఆపని చేయలేదు. అయితే మన కాం’గ్రీసు’ చరిత్రకారులు  మహాత్మా గాంధీని నెహ్రూ కుటుంబంతో కలగలిపేసి ఒక “నెహ్రూగాంధీ కుటుంబ మలామా”ను తయారుచేసి మెరుగులు, పైపూతలు (కందెనలు) అద్దారు. కాంగ్రెసును జిగటైన కాం’గ్రీసు’గా మార్చి దానిపై సర్వహక్కులను నెహ్రూ కుటుంబీకులకు, వారి అభారతీయ వారసులకు ధారాదత్తం చేసి నాణానికి రెండు వైపులా ఒకే బొమ్మను చూపించి కీర్తనలు చేస్తున్నారు. చరిత్ర పూర్తిగా తారుమారు కాకూడదు కనుక మనం బొరుసు వైపు కూడా పరిశీలిద్దాం, నిజానిజాలను చర్చిద్దాం.

 

నెహ్రూలెవ్వరూ గాంధీయులు కారు!

“నెహ్రూ తాతగారు గంగాధర్ నెహ్రూ పూర్వ నామధేయం ఘాయిసుద్దీన్ ఘజీ. మొగల్ వంశస్థుడు!?” మొగలాయిల పాలనలో ఆయన 1857 వరకు ఢిల్లీలో కొత్వాల్ హోదా కలిగిన పోలీస్ అధికారిగా పనిచేశారు. ఢిల్లీ బ్రిటిష్ వారి కైవసం అయ్యాక, పరిపాలకులు మొగలాయీలను వెతికివెతికి చంపడం ప్రారంభించారు. కాలువ (హిందీలో నెహర్ ) వొడ్డున నివాసముంటున్న ఘజీ తన ఇంటిపేరును నెహ్రూగా మార్చుకుని గంగాధర్ నెహ్రూ అనే కాశ్మీరీ పండిట్ గా మారి ప్రాణాలు కాపాడుకున్నాడు.

ఈ విషయాన్నీ తమ స్వీయ చరిత్రలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ స్వహస్తాలతో వ్రాసుకున్నారు నెహ్రూ, ఆయన రెండవ చెల్లెలు కృష్ణ. (మరెన్నో నెహ్రూ కుటుంబ నిజాల గురించి వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తివుంటే – http://nehrufamily.files.wordpress.com/2011/12/30/nehru-family-truth/ లోనికి వెళ్లి చూడండి. అనేక లింకులు, ఆశ్చర్యాలు మీ స్వంతం)

 

వ్యసనవ్యామోహాల నెయ్యరి నేహ్రూ!

“భూమ్మీద సుఖపడితే తప్పులేదురా! బులబాటం తీర్చుకుంటే తప్పు లేదురా! తప్పేలేదురా!” అని దర్శకుడు బాపూ, మన ఆరుద్ర చేత పాట వ్రాయించి, మహదేవన్ చేత బాణీ కట్టించి, ఘంటశాల చేత గమ్మత్తుగా పాడించి, అన్నులమిన్నలతో ఆనాటి మేటి హీరో ఏయన్నార్ చేత ఆడించడం తెరమీద చూడ్డానికైతే మస్తు మజాగావున్నా, వాస్తవ జీవితంలో అలాగా మరీ బాహాటంగా బులబాటం తీర్చుకోడానికి మన దేశంలోని అధిక శాతం జనం ఇష్టపడరు. అయితే, మొగలాయుడైన మన నెహ్రూజీ అందుకు ఏమాత్రం వెరవ లేదు. వెనకడుగు వేయలేదు. (పైన కనిపించే దృశ్యాలు చాలు ఆయన బాహాట వ్యసన విలాస జీవనశైలిని చాటి చెప్పడానికి) అది ఆయనకు నచ్చిన వైఖరి. ఆయనైతే వాటిని దాచిపెట్టుకో లేదు. నిర్భీతిగా వ్యవహరించారు. తన వివాహేతర సంబంధాలను తప్పుగా భావించివుంటే తన ఏకైక ఇష్ట పుత్రిక ఇందిర వారించినా, ప్రియురాలు పద్మజా నాయుడి ఫోటోను పడకగదిలో వుంచుకునేవాడు కాడు. అంతఃపుర, అంతరంగికపు వ్యవహారాలను, ఊహాగానాలను, పుకార్లను పెడచెవిన పెట్టడమే మంచిపని. కానీ, నెహ్రూకు ఓ బెనారసీ సన్యాసినితో గల లైoగిక సంబంధం, భారత్ లో చివరి వైశ్రాయ్ మౌన్ట్ బాటెన్ భార్యతో (“తమ తల్లి ఎడ్వినాకు -నెహ్రూకు వున్న బంధం మహాలోతైన ప్రేమబాంధవ్యం” అని మౌన్ట్ బాటెన్ కుమార్తెలే బాహాటంగా ప్రకటించారు) వారి అనుబంధం వలన గాంధీజీకి అనేక చిక్కులు ఏర్పడ్డాయి. నిజానికి ప్రధమ భారతప్రధాని కొరకు జరిగిన ఎంపికలో నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1:8 తేడాతో మన నెహ్రూను దారుణంగా ఓడించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గెలిపించినా, చివరకు రాజీ మార్గంలో గాంధీజీ అండదండలతో ప్రధానిగా నెహ్రూజీ (ఉప ప్రధానిగా పటేల్) నాటి స్వతంత్ర భారతదేశపు పాలనా పగ్గాలు అందిపుచ్చుకున్నాడు.  ఇక ఆ తర్వాత ఆయన మద్యపాన, ధూమపాన, సరస శృంగార క్రీడల రూపు రేఖలు చిత్రంగా మారి పోయాయి. ఎఱ్ఱగులాబీ (?) ప్రియుడైన నెహ్రూ చిన్నపిల్లల (?) ప్రేమికుడై చాచా నెహ్రూగా మారాడు. ఛీఛీ అనకుండా అందరూ సంతోషించారు. ఇప్పుడీ కుహనా కాం’గ్రీసు’ భక్త-కోటరీ నాటి నెహ్రూ నుండి నేటి రాహుల్ వరకు నెహ్రూ కుటుంబీకుల చరితలను తారుమారు చేయుటెందుకు?

 

“నేతలకు నీతులు వర్తించవా?”

అని, ఇక్కడ ఇప్పుడు మేం ప్రశ్నించడం లేదు. అది వేరే చర్చ. కేవలం 57 ఏండ్ల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి వంశాన్ని అడ్డం పెట్టుకుని, నిజాలకు సమాధి కట్టి, ఆ వంశీకులను కీర్తిస్తూ, మన దేశానికి స్వాతంత్ర్యం రావడంలో ముఖ్య భూమికను పోషించిన 150 ఏండ్ల చరిత్ర గల గొప్పపార్టీకి మకిలి పట్టించడమే కాక, వాస్తవాలకు మసి పూసో, సున్నం కొట్టో దాచేయాలని ప్రయత్నించడం వలనే, అకృత్యాలకు ఆలవాలం అయిన ఢిల్లీ నుండి, అన్నెంపున్నెం ఎరుగని గల్లీ వరకు అవినీతి, రంకు, బొంకు, ఇంకా జంకులేని అగడుతనం -డ్రైనేజ్ లాగా మురుగు నురగలు గ్రక్కుతోంది. మంచిగంధానికి, మల్లెపూలకు రాజకీయాల్లో తావు లేకుండా పోతోంది. నాణానికి మరోవైపు చూస్తే నెహ్రూ వారసుల జీవనశైలికూడా ఆయన కంటే భిన్నమైనదేమీ కాదు. అలాంటి వారికి సంబంధించిన పూర్వాపరాలు జనసామాన్యానికీ తెలియడం ఎంతో అవసరం. సంప్రోక్షణలకు సమయం దగ్గర పడాలంటే మీరూ ఈ అంశాన్ని నలుగురితో షేర్ చేసుకోండి.

కాం’గ్రీసు’ చిల్లర బేహారీల కూటమికి చివరగా ఓమాట- నెహ్రూను లేక ఆ కుటుంబీకులలో ఏ ఒక్కరిని హిట్లర్ వంటి నియంతగానో, ఇడీఅమీన్ లాంటి క్రూరుడిగానో, గడాఫీ వంటి మహా పాపిగానో లేక వికృత మానసులుగానో చిత్రీకరించడం మా ఉద్దేశ్యం కాదు. నేటి జనానికి, రేపటి పౌరులకు పాలక నాయకుల నిజ చరిత్రలు అవగతం కావాలన్నదే మా అభిమతం. మన తొలి స్వతంత్ర భారత ప్రధానిగా నెహ్రూను గౌరవిస్తాం, గుర్తుంచుకుంటాం. ఆయన జయంతి, వర్థంతి సందర్భంగా అందరితోపాటు మేమూ నివాళులు అర్పిస్తాము. చరిత్రను, చరితలను వక్రీకరించడాన్ని మాత్రం గర్షిస్తాము. వ్యక్తుల అంతరంగిక జీవితాల జోలికి వెళ్లడం మా అభిమతం కాదు. అదే సమయంలో నేతల జీవన రీతులను తారుమారు చేయడం అంటే దేశద్రోహం కంటే పెద్ద నేరమని గుర్తించండి. 

 

మామాట:- అన్ని కాలాల్లోనూ విజేతల, విశిష్టుల జీవితాలందు సామాజిక ఉల్లంఘనలు వుండటం సర్వసాధారణ విషయమే. అయితే, వాటిని దాచిపెట్టి చరిత్రకు అందకుండా చేయడం అన్నది క్షమణీయమైన విషయం కాదు. అది, నాణాన్ని ఒక వైపుకే పరిమితం చేయడం అవుతుంది.

Leave a Reply