ఈ ముగ్గురూ కాక మరో నాయకుడా?

need for fourth leader in ap
Share Icons:

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యామ్నాయం కావాలి…
చాలామంది బాబుని వ్యతిరేకిస్తున్నారు…అయితే వారంతా జగన్ లేదా పవన్ లని సపోర్ట్ చేయడంలేదు!
ఈ ముగ్గురూ కూడా వద్దు.. మరో నాయకుడు వస్తే బాగుణ్ణు అనే వారి సంఖ్య పెరుగుతోంది! 

[pinpoll id=”66961″]

ప్రత్యామ్నాయం రాకపోయినా, లేకపోయినా కూడా ఎన్నిక జరుగుతుంది.. ముగ్గురిలో ఎవరో ఒకరు గెలుస్తారు! కానీ వాక్యూమ్ అలాగే ఉండిపోతుంది.

ఇది ఒక ఫెస్ బుక్ మిత్రుడు పోస్ట్. వారు సీనియర్ పాత్రికేయులు కూడా. రాజకీయంగా ఒక పార్టీతో అంటకాగుతుంటారు. వారు ఇలా పోస్ట్ పెట్టడంలోని మాయాజాలం ఏమిటో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పై వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాలలో శూన్యత ఉందా. నిజానికి జగన్, పవన్ పరిపాలన చేయకుండానే, వారిని ప్రజలు ఆదరించి-తిరస్కరించకుండానే వారు వద్దనుకుంటున్నట్టు మనం చెప్పగలమా, అటువంటి పరిస్థితి నిజంగా ఉందా..  సరే చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురూ కాకుంటే వచ్చే కొత్త నాయకుడు ఎవరు.. ఏమిటీ మైండ్ గేమ్.. కమలాలూ…

 

మామాట: తినగ తినగ వేము తీపి అయినట్టు.. అనగ అనగ అసత్యం సత్యం  అవుతుందా.

Leave a Reply