బీజేపీ-శివసేనలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటున్న పవార్

Maharashtra polls 2019: BJP-Shiv Sena announce seat-share
Share Icons:

ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు అవుతున్న….ఇంకా బీజేపీ శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.  సీఎం సగం పంచుకోవాలని శివసేన పేచీ పెట్టడంతో వారి ప్రభుత్వ ఏర్పాటుకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ ఎన్‌సి‌పి చీఫ్ శరద్ పవార్ తో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక వారి భేటీ ముగిసిన అనంతరం శరద్ పవార్ మీడియాతో మాట్లాడి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో పాటు మా పార్టీ ఎన్సీపీ విపక్షంలో కూర్చుంటుందని తెలిపారు.

ఇది ప్రజలు ఇచ్చిన తీర్పని, దానికి కట్టుబడి ఉంటామని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. శివసేనతో కలవబోమని అన్నారు. బీజేపీతో కలిసే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ సమావేశాలపై సంజయ్ రౌత్ తనతో చర్చించారని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించామని చెప్పారు.

అంతకముందు సంజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హారాష్ట్ర ఎన్నికల ముందు బీజేపీ-శివసేన మధ్య కుదిరిన ఒప్పందంపై మాత్రమే చర్చలు జరగాలని అన్నారు. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలన్న విషయంపై బీజేపీతో ఒప్పందం కుదిరిందని ఆయన మరోసారి చెప్పారు.

ఆ తర్వాతే బీజేపీతో కలిసి తాము ఎన్నికల్లో పోటీ చేశామని సంజయ్ రౌత్ అన్నారు. ఇకపై బీజేపీతో చర్చలు జరిగితే ఈ అంశంపై మాత్రమే చర్చలు జరగాలని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన జాప్యం నేపథ్యంలో ఈ విషయంపై ఆర్ఎస్ఎస్ మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలిశారు. మరి చూడాలి మహారాష్ట్రలో ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత శాసనసభ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగుస్తున్నప్పటికీ… ప్రభుత్వ  ఏర్పాటు దిశగా ఇంత వరకు ఒక్క అడుగు కూడా పడలేదు. 50:50 ఫార్ములాకు కట్టుబడి తమకు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని ఇవ్వాలన్న శివసేన డిమాండ్ కు బీజేపీ తలొగ్గలేదు.

 

Leave a Reply