Header Banner
Header Banner
TRENDING NOW

ఏపీలో జగన్‌దే అధికారం: నాయిని

ఏపీలో జగన్‌దే అధికారం: నాయిని

హైదరాబాద్, 8 అక్టోబర్:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ ఆపద్ధర్మ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు అధికారం దక్కించుకోబోతున్నారో అనే విషయంపై ఆయన జోస్యం చెప్పారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఏపీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారని అన్నారు. ఇక తన చెంచాలు ఒకరిద్దరు అసెంబ్లీలో ఉండాలని, కాంగ్రెస్‌తో సీఎం చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారని ఆరోపించారు. అలాగే రేవంత్‌రెడ్డి ఓ బచ్చా.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, కేసీఆర్‌ను తిట్టేందుకే రేవంత్‌ని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారని, రేవంత్ భూకబ్జాదారుడని ఆయన ఆరోపించారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డికి దమ్ముంటే టీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద గెలవాలని సవాల్ విసిరారు. ఎన్నికల విషయంలో ఈసీనే సుప్రీం అని, కోర్టుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేలిపోయిందని ఎద్దేవాచేశారు. 

మామాట: ముందు మీరు అధికారంలోకి వస్తారో లేదో చూసుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: