ప్రభుత్వం అంటే ప్రజలే…నా కర్తవ్యం నేరవేరుస్తా…!!

ప్రభుత్వం అంటే ప్రజలే…నా కర్తవ్యం నేరవేరుస్తా…!!
Views:
10

హైదరాబాద్, 13 మర్చి:

గతేడాది కోలివుడ్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘ఆరమ్’ సినిమాను ఈ నెల 16న తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార కలెక్టర్‌ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్‌ ట్రైలర్ ను ఈ రోజు ఆ సినీ బృందం విడుదల చేసింది.

చలన చిత్ర రంగంలో ప్రతిభావంతులైన కధానాయికల్లో నయనతార ఒకరు. ఈ నటి 2003లో సినీరంగప్రవేశం చేసి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ హోదాను తెచ్చుకుంది. కొద్ది రోజుల క్రితం ఆమె జీవితంలో ఎన్నో వివాదాస్పదాల సంఘటనలు చోటు చేస్కున్నా కూడా, ఎన్నడూ వెనుకడుగు వేయకుండా ఒంటరిగా పని మీద దృష్టి పెట్టింది. దక్షిణాదిలోని అన్ని భాషలలో ఈ నటి దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసింది. ఇప్పుడు కర్తవ్యం అనే ఒక ఆసక్తికరమైన చిత్రంతో హిట్టు కొట్టే ప్రయత్నం చేస్తోంది.

నార్త్ స్టార్ పతాకంపై శరత్ మారార్ నిర్మాణంలో గోపి నైనర్ కథా దర్శకత్వంపై సోమవారం యూ ట్యూబ్ లో ట్రైలర్ విడుదల అయింది. అయితే మార్చి 8న రిలీజ్ అయిన ఈ చత్రం టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఎక్కువ సమయం వృధా కానివ్వకుండా 4 రోజుల్లోనే ట్రైలర్ ని విడుదల చేసి ప్రేక్షకుల్లో మరింత ఉత్కంటత రేకెత్తిస్తున్నారు. నటి నాయన తార ఈ చిత్రంలో ఒక కలెక్టర్ గా సామాజిక ప్రజల జీవితాలను భాగుపరచే కర్తవ్యం గల భారత పౌరునిలా మనందరికీ కనిపించనుంది. బోరుబావిలో పడిన ఓ చిన్నారిని ఏవిధంగా రక్షించారు? అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ప్రభుత్వం అంటే ప్రజలే అంటు నయనతార చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. దర్శకుడు గోపి నైనర్ ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా రూపొందించారు.

మామాట: సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే 16 వరకు ఆగాల్సిందే…

English Summary: Lady Superstar Nayanthara who has been essaying interesting roles scored a massive hit with Aramm recently. The film has been dubbed into Telugu and is releasing as Karthavyam. Gopi Nainar is the director of the film which reveals about the bore well tragedy of a kid. Nayanthara plays a IAS in the film and the entire story reveals around her character.

(Visited 6 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: