‘మా’ అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణస్వీకారం 

Share Icons:

హైదరాబాద్‌, మార్చి 22,

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్‌ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నరేశ్‌ ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంలో కొంతకాలంగా నరేశ్‌కు, ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజాకు అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. కాగా ఆయన కూడా ఈరోజు ప్రమాణస్వీకారానికిహాజరుకావడం గమనార్హం.

ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. ‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు చెప్పిందేంటంటే.. మేం ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఫండ్స్‌ తీసుకొచ్చిపెట్టాం. దాంట్లోంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు కష్టపడి బయటనుంచి ఫండ్లు కలెక్ట్‌ చేసి తీసుకురావాలి అని చెప్పారు. తూచా తప్పకుండా వారి మాటను నేను పాటించాను. అదే విధంగా ఇప్పుడు పనిచేయబోయే కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నాను. నా నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమే అన్నారు.

‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించినట్లు ఈ సందర్భంగా నరేశ్‌ వెల్లడించారు.  కాగా, నేను అసోసియేషన్‌ కోసం బాగా కష్టపడతానని మాటిస్తున్నాను’ అని నరేశ్‌ మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు రాజశేఖర్. తనకు మాట్లాడటం ఇష్టం లేదంటూ మైక్ ఇచ్చి పక్కకు వెళ్లిపోయారు రాజశేఖర్, మళ్లీ జీవిత చేతుల్లో నుంచి మైక్ తీసుకొన్న రాజశేఖర్… మాట్లాడటానికి చాలా ఉందంటూ ప్రసంగించారు.

నరేష్ ‘నేను నేను’ అనకుండా మేము అని మాట్లాడాలన్నారు రాజశేఖర్. ఈ కార్యక్రమానికి రావాలన్న ఆసక్తి తనకు లేదని… అయితే నరేష్ వచ్చి పిలవడం వల్లే హాజరయ్యానని తెలిపారు. నరేష్ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. అందరం కలిసి మా ఎన్నికల కోసం పనిచేశామన్నారు. అందుకే ఇక నుంచి నేను అని కాకుండా మేము అని నరేష్ మాట్లాడాలని కోరారు. దీంతో ఆ సమయంలో పక్కనే ఉన్న నరేష్ రాజశేఖర్‌ను సముదాయించే ప్రయత్నం చేశారు. నేనేదో సరదాగా అన్నానన్నారు. మనమంతా కలిసే మా ఎన్నికల కోసం పనిచేశామన్నారు.

మామాట: మాలో వివాదం సమసినట్టేనా..

Leave a Reply