మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు కంగ్రాట్స్ చెప్పిన నారా లోకేష్…

Share Icons:

అమరావతి, 18 జూన్:

ఈరోజు ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేశ్…..అదే స్థానం నుంచి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు.

మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనసభకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసన మండలి సభ్యుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో ఆర్కే, లోకేష్ ఎదురుపడి ఒకరినొకరు పలకరించుకున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆర్కేకు.. లోకేష్ కరచాలనం చేసి కంగ్రాట్స్ తెలిపారు. ఇందుకు స్పందించిన ఆర్కే.. ధన్యవాదాలు తెలిపారు. ఇక తర్వాత ఆర్కే మీడియాతో మాట్లాడుతూ….. కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై తన పోరాటం కొనసాగుతుందని, చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమ కట్టడమేనని తెలిపారు. చంద్రబాబును కూడా ఖాళీ చేయించే వరకూ వదిలి పెట్టబోమన్నారు.

రాజధాని అమరావతిలో ఇల్లు లేని చంద్రబాబు.. అమరావతి మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ తాడేపల్లిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారని గుర్తుచేశారు. రాజధానిలో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న పనులు ఎందుకు ఆపారో ఆ కాంట్రాక్టర్లనే అడగాలని కోరారు.

కాంట్రాక్టర్లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని కలవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్సస్ టెండర్లు నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. సీఆర్‌డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రే ఉంటారని పేర్కొన్నారు. ఆ పోస్ట్ తనకు ఇస్తున్న విషయం తెలియదన్నారు.

Leave a Reply