Header Banner
Header Banner
TRENDING NOW

మంగళగిరి నుంచి నారా లోకేశ్!

మంగళగిరి నుంచి నారా లోకేశ్!

అమరావతి, మార్చి 13,

సీఎం చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో  లోకేశ్ గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మంగళగిరిలో టీడీపీ బలంగా ఉన్న నేపథ్యంలో లోకేశ్ పోటీచేస్తే విజయం నల్లేరుపై నడకలా మారుతుందని టీడీపీ వర్గీయులు భావిస్తున్నారు.

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

మంగళగిరి టికెట్ ను ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి కాకుండా ఓ బీసీ నేతకు కేటాయించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి దిగబోతున్న నేపథ్యంలో ఆయన్ను ఓడించేందుకు దీటైన అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దింపవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

లోకేశ్ తొలుత విశాఖలోని భీమిలి నియోజకవర్గం లేదా అనంతపురం జిల్లాలోని హిందూపురం నుంచి రంగంలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో మనసు మార్చుకున్న లోకేశ్ రాజధానికి సమీపంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి వైసీపీ నేత ఆర్కే చేతిలో ఓడిపోయారు.

మామాట: కనీసం ఈ మాటపై నైనా నిలబడతారా చిన బాబు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: