పేటీఎం బ్యాచ్ ప్రజల్ని వెర్రివాళ్లని చేయాలనుకుంటున్నారు..

nara lokesh fires on ysrcp government
Share Icons:

అమరావతి:

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ నేతలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ నేపథ్యంలో ఆయనను విడిపించడానికి విమానంలో ఢిల్లీ వెళుతున్న రామోజీరావు, నళిని చిదంబరం, నారా భువనేశ్వరి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఓవైపు రామోజీరావు, మరోవైపు భువనేశ్వరి ఉండగా మధ్యలో మరో మహిళ కూర్చుని ఉన్నారు. పోస్టు పెట్టిన వ్యక్తి ఆమెను నళిని చిదంబరంగా పేర్కొన్నాడు.

ఈ ఫోటోలో ఉన్నది నళినీ చిదంబరం కాదని, తానని, తన పేరు వనజ అని, “మీరు అసలు ఏ లోకంలో ఉన్నారు నాకైతే అర్ధం కావడం లేదు…అసలు ఆ ఫోటో లో ఉన్నది నళిని చిదంబరం కాదు…వనజ అనబడే నేను… అయ్యినా ఒకర్ని మించి ఒకరు అబ్బాద్దాలు పొద్దుటనుంచి సృష్టిస్తూ ఉన్నారు” అని వనజ స్పందించారు.

దీనిపై లోకేశ్ స్పందిస్తూ ఇదొక ఫేక్ మెసేజ్ అని స్పష్టం చేశారు. జఫ్ఫాలు మరోసారి పట్టుబడ్డారని, పేటీఎం బ్యాచ్ సభ్యులు ప్రజలందరినీ అన్ని సార్లూ ఫూల్స్ చేద్దామని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. మధ్యలో ఉన్నది చిదంబరం భార్య కాదని స్పష్టం చేశారు.

Leave a Reply