జగన్ గారూ..సీట్లు, ఓట్లు చెబితే పెట్టుబడులు వస్తాయా?

nara lokesh fires on ysrcp government
Share Icons:

అమరావతి:

 

శుక్రవారం విజయవాడ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన తొలి పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన తీరును టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా సాధించిన ఓట్లు, సీట్లు చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటారా? అని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.

 

రాష్ట్రంలో ఉన్న వనరులు ఏమిటి? పెట్టుబడులు పెట్టేవారికి ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది? వచ్చిన వారికి ఎటువంటి ప్రగతి లభిస్తుంది? వంటి అంశాలు వివరించకుండా వైసీపీ ప్రభుత్వం సొంత భజన చేసుకుని వచ్చిన వారికి నిరాశ మిగిల్చిందన్నారు. గత ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్వారా సాధించిన 700 అవార్డులు, ప్రగతి గురించి చెప్పలేక తమది పేద రాష్ట్రమని జగన్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు.

 

ఇదిలా ఉంటే ఏపీలో ‘మీసేవా’ కేంద్రాలు రద్దు చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అదృష్టం అందలం ఎక్కిస్తే, బుద్ధి బురదలోకి లాగుతుంది. జగన్ గారిని చూస్తుంటే ఇది నిజం అని తేలిపోయింది. అందరికీ సమన్యాయం చేస్తా అంటే ఏంటో అనుకున్నాం’ అంటూ  సీఎంను  ఎద్దేవా చేస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

Leave a Reply