కర్నూలు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు వీళ్ళే….

కర్నూలు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు వీళ్ళే….
Views:
101

కర్నూలు, 9 జూలై:

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రకటించారు. ఈరోజు ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కర్నూలు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించారు.

butta renuka going to be suspend

అయితే ఎన్నికలకి ఇంకా దాదాపు 10 నెలల సమయం ఉన్నా అభ్యర్ధులను ఇప్పుడే ప్రకటించడం ద్వారా ఇక్కడ టీడీపీలో వర్గ విబేధాలు పెరిగే అవకాశాలు న్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అందులో భాగంగానే జిల్లాలో సోమవారం జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ వీరిద్దరి పేర్లను ప్రకటించిన వెంటనే రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పక్క సీటుకు మారిపోయాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ప్రకటన టీజీ వర్గీయుల్లో ఆగ్రహం తెప్పిస్తుందనే చెప్పాలి.
sv mohan reddy

2014 ఎన్నికలకు ముందు టీజీ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా టీజీ.. వైసీపీ అభ్యర్ధియైన ఎస్వీ మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరారు.

ఇదే తరుణంలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన టీజీకు చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. అయితే 2019 ఎన్నికల్లో వెంకటేష్ తన కొడుకు టీజీ భరత్‌ను కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని భావిస్తున్నారు.

టీజీ వర్గం వర్సెస్ ఎస్వీ వర్గం..

ఈ నేపథ్యంలోనే టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయులు పోటా పోటీగా కర్నూలు పట్టణంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరోకరు పార్టీలో ఆధిపత్యం పెంచుకుంటూ.. ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఈరోజు కర్నూలు పర్యటనకి వచ్చిన లోకేష్ హఠాత్తుగా సభలో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లను ప్రకటించారు.

దీంతో టీజీ వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రకటన చేయగానే టీజీ వెంకటేష్ అసంతృప్తితో తాను కూర్చొన్న సీటు నుండి మరో సీటులోకి మారిపోయారు. అయితే లోకేశ్ తానంతట తాను ఈ పేర్లు ప్రకటించడా? లేక చంద్రబాబు నిర్ణయం మేరకు చెప్పడా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా లోకేశ్ అభ్యర్ధులని ప్రకటించి పెను దుమారం లేపారనే చెప్పాలి.

మామాట: పార్టీలో లోకేశ్ ఆధిపత్యం కొనసాగుతుందని అర్దమవుతోంది…

(Visited 122 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: