ట్విట్టర్ నుంచి బయటకొస్తున్న చినబాబు….కీలక పదవి ఖాయమేనా?

vijayasai reddy comments on chandrababu and lokesh
Share Icons:

అమరావతి: తెలుగుదేశం చరిత్ర లేని విధంగా మొన్న ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేవలం ఆ పార్టీ 23 సీట్లకే పరిమితమైంది. అయితే ఓటమి పాలయ్యాక చాలామంది నేతలు పార్టీ వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒకవైపు పార్టీ బలహీన పడుతుంది. ఈ క్రమంలో అధినేత చంద్రబాబు పార్టీని బలోపేతం చేసేందుకు కాళ్ళకు బలపం కట్టుకుని మరి జిల్లాలు తిరుగుతూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

కానీ బాబు కష్టపడుతున్న మిగతా నేతలు ఎవరు పెద్దగా సహకరించడం లేదు. అటు భవిష్యత్ పార్టీకి నాయకుడుగా అనుకుంటున్న లోకేశ్ కూడా ఓటమి తర్వాత ట్విట్టర్ కే పరిమితమైపోయారు. ట్విట్టర్ వేదికగానే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా లోకేశ్ ట్విట్టర్ నుంచి ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు.  ప్రస్తుతం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా వున్న నారా లోకేష్‌…ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత డీలా పడ్డ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఇటీవలే ఇసుక కొరతపై గుంటూరులో ఒక రోజు దీక్ష చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యాలపై గ్రౌండ్‌ లెవల్లో పోరాటాలకు ప్లాన్‌ చేస్తున్నారు.

కాకపోతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మంత్రి ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలను చూశారు. పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తర్వాత పుల్‌ టైమ్‌ పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. దీంతో ఇప్పుడు ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా లోకేష్ నియమిస్తారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని గతంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ అవి వర్క్‌వుట్‌ కాలేదు. మహానాడులో ఆయన్ని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ అది కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇస్తారని ప్రచారం టీడీపీలో జరుగుతోంది. మరి చూడాలి లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వస్తుందా> వస్తే పార్టీని ఏ మేర బలోపేతం చేస్తారో?

 

Leave a Reply