మహానాయకుడులో నారా, నందమూరి వారసులు…!

Share Icons:

హైదరాబాద్, 11 ఫిబ్రవరి:

ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే జనవరి 9న విడుదలైన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. సుమారు 50 కోట్ల వరకు నష్టపోయింది. దీంతో చిత్రబృందం మహానాయకుడు స్క్రిప్ట్ లో చాల మార్పులు చేశారు. కొన్ని కొత్త సీన్స్‌ని యాడ్ చేస్తూ.. ‘మహానాయకుడు’ షూటింగ్‌ని ఇటీవలే ముగించారు.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒయా ఆసక్తికరమైన విషయం ఒకటి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో చంద్రబాబు, బాలకృష్ణల మనవడు దేవాన్ష్ నటించాడని తెలుస్తోంది. దేవాన్ష్ సీన్ల చిత్రీకరణ కూడా పూర్తయిపోయిందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నందమూరి కల్యాణ్ రామ్ తనయుడు శౌర్యా రామ్ కూడా నటించినట్టు తెలుస్తోంది. ఇక విషయాలు నిజమో కాదో సినిమా విడుదల అయ్యాక తెలుస్తాయి.

మామాట: మరి రెండో పార్ట్ అయిన విజయం సాధిస్తుందో లేదో చూడాలి…

 

Leave a Reply