త్వరలో నానీ శ్రీరెడ్డిల డర్టీ పిక్చర్.. : శ్రీరెడ్డి

Nani Sri reddy dirty picture coming soon
Share Icons:

హైదరాబాద్, 08 జూన్:

కాస్టింగ్ కౌచ్ విషయంలో దుమ్ము లేపిన శ్రీరెడ్డి తాజాగా న్యాచురల్ స్టార్ నానిపై తీవ్ర విమర్శలు చేసింది. నాని ప్లస్ శ్రీరెడ్డి= డర్టీ పిక్చర్.. అంటూ మరో వివాదానికి తెరలేపింది..

తాజాగా ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టిన శ్రీరెడ్డి హీరో నానిపై, పవన్ కల్యాణ్‌పై, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం ట్విట్టర్‌లో ట్వీట్లు కూడా చేసింది.

‘నాని ప్లస్ శ్రీరెడ్డి = డర్టీ పిక్చర్… ఎప్పుడు? కమింగ్ సూన్… ఆన్ ది వే..  నానిగాడి రాసలీలలు అన్నీ బయటపెడతా… ‘కాసుకోర నాని… నీ కాపురంలో నిప్పులే’ అంటూ శ్రీరెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

అనతరం పవన్ కల్యాణ్ గురించి, చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ “పలాసలో పులస చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు. అన్యాయం, అక్రమం, దౌర్జన్యాల గురించి మీరే చెప్పాలి” అంటూ వ్యగ్యంగా మాట్లాడింది.

“మీ అన్నయ్య వాటికి బ్రాండ్ అంబాసడర్. ఎమ్మెల్యే సీట్లు కొనుక్కున్నవారికి కుచ్చు టోపీ, ఓట్లు వేసిన ప్రజల నోట్లో మట్టి కొట్టారు. నీ బండ పడ. సీఎం అనగానే నీ మొహం చూడాలి. సీఎం సీఎం అని ఇక్కడదాకా లాక్కొచ్చారంట. సినిమాల్లో కోట్లు ఎందుకు వదిలేశావో ఎవరికి తెలియదు నాయనా?” అంటూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

మామాట: ఇంకెన్ని గుట్టులు రట్టు చేస్తుందో చూడాలి…

Leave a Reply