సుధీర్ బాబుతో కలిసి ‘వి’ షూటింగ్ లో పాల్గొనున్న నాని…

nani ready to attend the next movie shooting
Share Icons:

హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ దూకుడు మీద ఉన్నారు. శుక్రవారమే నాని నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక నాని వెంటనే తన తదుపరి సినిమా షూటింగుకి సిద్ధమవుతున్నాడు. నాని తదుపరి చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘వి’ అనే టైటిల్ తో ఈ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతోంది.

ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు – నాని ఇద్దరూ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు థాయ్ లాండ్ లో జరుగుతోంది. సుధీర్ బాబు కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే నాని అక్కడ జరుగుతోన్న షూటింగులో జాయిన్ కానున్నాడు. అక్కడ నాని – సుధీర్ బాబు కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. అయితే ఇందులో నాని పాత్ర నెగెటివ్ షేడ్స్ తో కూడినదిగా వుంటుందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో, నివేదా థామస్ .. అదితీరావు హైదరి కథానాయికలుగా కనిపించనున్నారు.

‘వాల్మీకి’కి హైకోర్టు నోటీసులు…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదలకి సిద్ధమైంది. అయితే వాల్మీకి టైటిల్ మార్చాల్సిందేని బోయ హక్కుల పోరాట సమితి పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా, తాజాగా ఆ పిటిషన్ పై విచారణ చేపట్టారు.

ఈ నేపథ్యంలో, హైకోర్టు వాల్మీకి హీరో వరుణ్ తేజ్ తో పాటు, చిత్ర యూనిట్ కు, రాష్ట్ర డీజీపీకి, సెన్సార్ బోర్డుకు, ఫిలించాంబర్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మరో నెలరోజుల తర్వాత ఉంటుందని పేర్కొంది.

Leave a Reply