నాని ‘జెర్సీ’ టీజర్ వచ్చేసింది…

Share Icons:

హైదరాబాద్, 12 జనవరి:

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’సినిమా రూపొందుతోంది. ఇందులో నాని 36 ఏళ్ల క్రికెటర్‌గా అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న ఈ సినిమా నుండి…. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఇక క్రికెటర్‌గా తాను అనుకున్న స్థానానికి చేరుకోవడానికి నాని పడిన కష్టం .. తాను అనుకున్న స్థాయికి చేరుకుని పొందిన ఆనందం ఈ టీజర్లో చూపించారు. ఇక చివరిలో ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గానీ .. ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడు’ అనే డైలాగ్ చాలా బాగుంది.

శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తన కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోతుందని నాని భావిస్తున్నాడు.

మామాట: జెర్సీతో నాని హిట్ బాట పడతాడా…

 

Leave a Reply