Nani: నాని సినిమా నిర్మాతలు జంప్.. కారణం అదే! నాచురల్ స్టార్ అంతలా హర్టయ్యారా?

Share Icons:
టాలీవుడ్‌లో నాచురల్ స్టార్ నానికి ఉన్న డిమాండే వేరు. ఆయన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ఆనవాయితీ ఉంది. సినిమా చేస్తే దాదాపుగా నష్టమనేది ఉండదని మేకర్స్ భావిస్తుంటారు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారాలను బట్టి అర్థమవుతోంది. నాని అప్‌కమింగ్ మూవీ ” నిర్మాతలు అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని, దానికి కారణం నాని లాస్ట్ మూవీ V అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

ఇటీవలే ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో రూపొందిన V సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాని ఆశించిన మేర ఫలితం రాబట్టలేకపోయాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాపై నెగెటివ్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ నాని తదుపరి సినిమా ‘శ్యామ్ సింగరాయ్’పై పడిందని తెలుస్తోంది. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్‌‌పై నిర్మించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

Also Read:
అయితే నాని గత సినిమా V నెగిటివ్ ఫీడ్ బ్యాక్ చూసిన ఆ నిర్మాతలు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని టాక్ నడుస్తోంది. ఈ విషయం నానికి తెలిసి బాగా హర్ట్ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కథ ప్రకారం బడ్జెట్ కాస్త ఎక్కువవుతోందనే కారణం చూపుతూ వారు తప్పుకున్నారని ఫిలింనగర్ టాక్.

కాగా V వరుస తర్వాత వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నాని.. ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ బాణీలు కట్టిన ఈ మూవీ అతిత్వరలో విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ఫినిష్ కాగానే ‘శ్యామ్ సింగరాయ్’ మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు నాని.