Nandini Rai: తేజ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌! రంగంలోకి బిగ్ బాస్ బ్యూటీ.. ట్విస్టులే ట్విస్టులు

Share Icons:
ప్రస్తుతం సిల్వ‌ర్ స్క్రీన్‌కు పోటీగా డిజిట‌ల్ రంగం డెవ‌ల‌ప్ అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్ సాధనాలుగా ఓటీటీ వేదికలు ఊపందుకున్నాయి. ఇంట్లోనే కూర్చొని సొంత హోమ్ థియేటర్‌లో ఆన్‌లైన్ తెరపై సినిమాలు చూసేందుకు మక్కువ చూపుతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లకు డిమాండ్ పెరగడం, స్టార్ హీరోహీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి కనబర్చడం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే డైరెక్టర్ చూపు ఈ డిజిటల్ మాద్యమంపై పడిందట. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తుండటం చూసిన ఆయన తన క్రియేటివిటీకి పదును పెడుతూ యూత్ ఆడియన్స్ టార్గెట్‌గా ఓ బోల్డ్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు స్క్రిప్ట్ రెడీ చేసుకున్న ఆయన ఏకంగా హాట్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్‌‌ని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.

Also Read:
ఆయన రెడీ చేస్తున్న ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాలతో పాటు ట్విస్టుల మీద ట్విస్టులు ఉండేలా చేసుకుంటున్నారట. గతంలో ”నువ్వునేను, జయం” లాంటి సినిమాలతో వెండితెర ప్రేక్షకులకు కొత్త టేస్ట్ చూపించిన తేజ.. ఇప్పుడు ఓటీటీ ట్రెండ్ కూడా క్యాచ్ చేసుకొని తన మార్క్ వేసుకోవాలని బలంగా ఫిక్సయినట్లు ఇన్‌సైడ్ టాక్.

మరోవైపు ఇప్పటికే హీరో గోపిచంద్‌తో ‘అలివేలుమంగ వేంకటరమణ’, దగ్గుబాటి రానాతో ‘రాక్షసరాజు రావణాసురుడు’ చిత్రాలను తేజ ప్రకటించారు. సో.. చూడాలి మరి ఆ రెండు సినిమాల కంటే ముందే ఈ వెబ్ సిరీస్ చేస్తారా? లేక వాటితో పాటే సెట్స్ మీదకు వస్తారా? అనేది.