చంద్రబాబు కోర్టుకు రాకుంటే అరెస్ట్ చేసి తీసుకోస్తాం: నాందేడ్ ఎస్పీ

tdp activist express his dis satisfaction before the cm chandrababu
Share Icons:

ముంబై, 14 సెప్టెంబర్:

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు 15మందిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడుపై  మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 15 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది.

అయితే బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘర్షణలపై ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అనుమానాలపై నాందేడ్ ఎస్పీ కతార్ స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఐదేళ్లకు పూర్వమే చార్జిషీట్ దాఖలు చేశామని, ఆ ప్రతులను నిందితులుగా పేర్కొన్న అందరికీ పంపించామని ఆయన స్పష్టం చేశారు.

పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులను అడ్డుకున్నారన్న ఆరోపణలు వారిపై నమోదయ్యాయని, అప్పటి వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలుగా ప్రవేశపెట్టినట్టు ఆయన చెప్పారు. 16 మందిపై చార్జ్ షీట్ దాఖలైందని, కేసులో అభియోగాలు నమోదు చేశాక, విచారణ ఆసాంతం కోర్టు పరిధిలోనే ఉంటుందని గుర్తు చేశారు.

నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కోర్టు విచక్షణాధికారమని అభివర్ణించిన ఆయన, చంద్రబాబు సహా ఇతర నిందితులు కోర్టుకు రాకుంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.

మామాట: మరి 21 తేదీ లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి…

Leave a Reply