కల్యాణ్ రామ్‌తో జోడీ కట్టనున్న మెహ్రీన్…

Share Icons:

హైదరాబాద్, 12 జూన్:

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా… మల్లిడి వేణు దర్శకత్వంలో ‘తుగ్లక్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత కల్యాణ్ రామ్ ..ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న తో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ నటించనుంది. ఇక ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరించనుండగా, గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. కాగా, రాజా, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాలకు రచయితగా వ్యవహరించిన సతీశ్ వేగేశ్న శతమానంభవతి, శ్రీనివాసకళ్యాణం లాంటి కుటుంబచిత్రాలని తెరకెక్కించారు.

Leave a Reply