రేపు అధికారిక లాంఛనాలతో తుది సంస్కారం

Share Icons:

హైదరాబాద్, ఆగస్టు 29,

సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు హరికృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నల్గొండ జిల్లాలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మృతిచెందిన సంగతి తెలిసిందే.  కాగా దివంగత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు రేపు(గురువారం) జరగనున్నాయి. హైదరాబాద్ మొయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ లో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. ఆయన పెద్ద కుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు జరిగిన చోటే హరికృష్ణ అంతిమ సంస్కారం కూడా జరగనుంది. హరికృష్ణ రోడ్డు ప్రమాదానికి గురైన ప్రాంతానికి సమీపంలోనే జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదానికి గురై, మరణించిన సంగతి తెలిసిందే. అదే ఫామ్ హౌస్ లో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగు తున్నాయి.

మామాట: ఉదారత చాటుకున్న సీఎం కేసీఆర్..

Leave a Reply