జలవిహార్‌లో నందమూరి హరికృష్ణ పెద్దకర్మ..

cine and political celebrities shocked to listen hari krishna dead news
Share Icons:

హైదరాబాద్, 8 సెప్టెంబర్:

గత నెల 29వ తేదీన ప్రమాదవశాత్తూ మృత్యు వాత పడ్డ నందమూరి హరికృష్ణ పెద్ద కర్మ శనివారం ఉదయం 11.30 గం.లకు హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరుగనున్నాయి.

కొద్ది రోజుల క్రితమే పెద్దకర్మకు సంబంధించిన సమాచార పత్రికలు ప్రముఖులందరికీ చేరడంతో  ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నెక్లెస్ రోడ్ చేరుకున్నారు.

కార్యక్రమానికి కావలసిన అన్నీ ఏర్పాట్లు పూర్తి కాగా జలవిహార్‌లోని గ్రాండ్ లాన్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని హరికృష్ణ తనయులు కల్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ పూర్తి చెయ్యనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం కోసం మీటింగులు అన్నీ విరమించుకుని హైదరాబాద్ విచ్చేశారు.

నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

మామాట: సీతయ్యకు నివాళులు…

 

 

 

Leave a Reply