బాలయ్య, వినాయక్‌ల కాంబో..టైటిల్ ఇదేనా..

Share Icons:

హైదరాబాద్, 27 నవంబర్:

బాలకృష్ణ హీరోగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ‘ఎన్టీఆర్..కథానాయకుడు’, ఎన్టీఆర్..మహానాయకుడు’ అనే రెండు పార్టులుగా రెండు వారాల గ్యాప్‌లో రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ బయోపిక్ తర్వాత నందమూరి నట సింహం..వివి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మార్చి సెకండ్ వీక్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాకు ‘క్రాంతి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

అయితే ‘చెన్నకేశవరెడ్డి’ తర్వాత దాదాపు 16 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత బాలయ్య, వినాయక్‌లు ఈ మూవీ కోసం కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇక చిరంజీవితో చేసిన ‘ఖైదీ నంబర్ 150’ మినహాయిస్తే…దర్శకుడిగా వినాయక్ ట్రాక్ ఏమంత బాగాలేదు. అయినా..బాలకృష్ణ..వినాయక్ చెప్పిన కథపై నమ్మకంతో ఈ సినిమా చాన్స్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బాలయ్య వినాయక్‌తో మూవీ చేస్తూనే మరోవైపు బోయపాటి శ్రీను మూవీని కూడా సమాంతరంగా చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశాలున్నాయి.

మామాట: వయసు పెరుగుతున్న బాలయ్య… జోరు తగ్గట్లేదుగా…

Leave a Reply