ఏఎన్నార్ బయోపిక్‌కి నాగ్ ఒకేనా…!

Share Icons:

హైదరాబాద్, 11 జనవరి:

ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగా…తాజాగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఏఎన్నార్ బయోపిక్‌కి సంబంధించిన ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా నాగార్జునకి కూడా ఏఎన్నార్ బయోపిక్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఏఎన్నార్ జీవితం చాలా సాఫీగా సాగిపోయిందనీ, అందువలన ఆయన బయోపిక్‌ను తెరకెక్కిస్తే డ్రామా లేదంటూ ప్రేక్షకులు తిరస్కరించే అవకాశాలు వున్నాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఏఎన్నార్ బయోపిక్ విషయంలో నాగార్జున మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. తరువాత తరాలవారికి ఏఎన్నార్ గురించిన జీవిత విశేషాలను అందిస్తే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారట. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో ఏఎన్నార్ గా సుమంత్ లుక్ ప్రశంసలు అందుకోవడంతో, బయోపిక్ అంటూ తీస్తే సుమంత్ తోనే తీయవచ్చనే వార్తలు వస్తున్నాయి.

మామాట: మొత్తానికి ఏఎన్నార్ బయోపిక్ కూడా చూడబోతున్నాం..

Leave a Reply