నాగబాబు – కేఏ పాల్ ఢీ

Share Icons:

అమరావతి, మార్చి21,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే ఏపీని అమెరికాలాగా మార్చేస్తానని ప్రజాశాంతి అధ్యక్షుడు, మతప్రచారకుడు కేఏ పాల్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తన నాయకత్వంలోని ప్రజాశాంతి పార్టీ ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో తాను నరసాపురం లోక్ సభ, భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని పాల్ వెల్లడించారు. ఇందుకోసం రేపు 20 లక్షల మంది మద్దతుదారులతో కలసి నామినేషన్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. నరసాపురం నుంచి జనసేన తరఫున ప్రముఖ నటుడు, మెగాబ్రదర్ నాగబాబు పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

మామట: బయటే జబర్దస్త్ కామెడీ కదా… పాల్ జీ

Leave a Reply