జబర్దస్త్ అప్పుడే ఆగిపోతుందని అనుకున్నాను….కానీ

nagababu and three teams out of jabardasth program
Share Icons:

హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న జబర్దస్త్ షో నుంచి జడ్జీగా వ్యవహరించిన నాగబాబు ఇటీవల తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి తప్పుకుని వేరే చానల్ లో ప్రసారం కానున్న షో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ గురించి ఆయన తన యూట్యూబ్ చానల్ మై చానల్ నా ఇష్టం అనే ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అసలు జబర్దస్త్ షోకి ఎక్కువగా ప్రాణం పెట్టి పనిచేసేది ఆర్ట్ డైరెక్టర్ రమేశ్ అని చెప్పారు. అప్పటికప్పుడు తమకు పలానా సెట్ కావాలని అడిగితే.. తక్కువ సమయంలోనే అలాంటి సెట్‌ను డిజైన్ చేసేవాడని చెప్పారు. తక్కువగా మాట్లాడే అతను.. పనితనంలో మాత్రం ది బెస్ట్ అన్నట్టు వ్యవహరించేవాడన్నారు.

అలాగే మొదట్లో జబర్దస్త్ షోకి దర్శకుడిగా వ్యవహరించిన సంజీవ్, ఆ తర్వాత వచ్చిన నితిన్,భరత్ షో సక్సెస్‌కి ప్రధాన కారకులని చెప్పారు. వీరందరి కృషి వల్లే ఎప్పుడో 25 ఎపిసోడ్స్ దగ్గరే ఆగిపోవాల్సిన జబర్దస్త్..ఏడేళ్లు విజయవంతంగా కొనసాగిందన్నారు. ఇదే వీడియోలో రచ్చ రవి యాక్సిడెంట్ గురించి కూడా నాగబాబు ప్రస్తావించారు. రచ్చ రవికి యాక్సిడెంట్ అయిన సమయంలో జబర్దస్త్ టీమ్ అంతా అతనికి ఆర్థిక సహాయం అందించిందని గుర్తుచేశారు.

ఇక ‘జబర్దస్త్’ షోకి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయినప్పటికీ .. ఇది మల్లెమాల షో అని కొందరు .. ఈటీవీ షో అని మరికొందరు అన్నప్పటికీ నేను ఆ విషయాలను గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇది నా షో అనుకుని చేసేవాడిని. ‘జబర్దస్త్’కి సంబంధించిన వాళ్లమంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేవాళ్లం. ఏ ఒక్కరికీ కష్టం వచ్చినా మిగతా వాళ్లమంతా కలిసి ఆదుకునేవాళ్లం. అక్కడి నుంచి నేను బయటికి రావడానికి పారితోషికం కారణం కానేకాదు .. అలా అని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు” అని స్పష్టం చేశారు.

 

Leave a Reply