ఏపీ ప్రభుత్వంపై నాగబాబు విమర్శలు… మత మాఫియా ప్లాన్స్ అర్థం కావటం లేదు

Share Icons:

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై మెగాబ్రద, జనసేన నేత నాగబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ఏపీలో దేవాలయాల భూముల విషయంలో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. తాజా పరిణామాలు చూస్తే ఆందోళన కలుగతోందని.. బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి హిందూ సంస్థలు ఏదైనా చేయాలంటున్నారు మెగా బ్రదర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆసక్తికర ట్వీట్‌లు చేశారు.

నాగబాబు తన ట్వీట్‌లలో ‘మన కళ్ళ ముందే మన దేవాలయాల వేలాది ఎకరాల భూములు ఉంటాయా లేక మాయం అవుతాయా అనే విషయం అర్ధం కావటం లేదు’అన్నారు. ఈ మత మాఫియా ప్లాన్స్ అర్థం కావటం లేదని.. ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ వంటి హిందు సంస్థలు ఏదైనా చెయ్యాలి అన్నారు. తమలాంటి నాస్తిక హిందువుల సపోర్ట్ కూడా ఉంటదన్నారు.

ఈ విషయంలో దేవుని నమ్మే హిందువులు ఏమిచేస్తారో స్పష్టమైన ఒక వైఖరి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చ చ ప్రభుత్వం వారే ఒక మతాన్ని ఇలా తొక్కేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించాల్సిందేనా అంటూ ప్రశ్నించారు. ఆదాయానికి హిందు దేవాలయాలు.. ఓట్ల కోసం ఇతర మతాలకి వత్తాసు పలకడం. హిందూ మతం అంతరించిపోవటానికి దగ్గరగా ఉందేమో అన్నారు. హిందువులకి మత సామరస్యం మరి ఎక్కువ.. కొంచెం తగ్గితే మంచిదని వ్యాఖ్యానించారు. మతాన్ని, సంస్కృతిని కాపాడాల్సిన సాములోర్లే జనాన్ని మోసం చేస్తే ఏమి చెయ్యగలం.. నో నో మన మతాన్ని నాస్తిక ,ఆస్తిక హిందువులందరు కలిసి కాపాడుకుందాం అన్నారు. నాగబాబు తన ట్వీట్‌లలో ఎక్కడా ప్రభుత్వాన్ని ప్రస్తావించకుండా విమర్శలు చేశారు.

కాగా, ఇటీవల జగన్ ప్రభుత్వం సింహాచలం ఆలయ ట్రస్ట్‌ ధర్మకర్తగా ఎన్నో ఏళ్ళు నుంచి సేవలు అందిస్తున్న అశోక్ గజపతిరాజుని తప్పించి, ఆయన అన్న ఆనందగజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచయితని నియమించారు. ఈ క్రమంలోనే నాగబాబు పరోక్షంగా సింహాచలం ఆలయ భూముల అంశాన్ని ప్రస్తావించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 

Leave a Reply