చిరంజీవి బయోపిక్.?…నాగబాబు ఏమన్నారంటే

Share Icons:

హైదరాబాద్, 15 ఫిబ్రవరి:

ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్సార్‌లు తెరపైకి వచ్చాయి. త్వరలోనే చంద్రబాబు, కేసీఆర్, పుల్లెల గోపీచంద్, సానియా మీర్జాల బయోపిక్‌లు రాబోతున్నాయి. 

ఈ క్రమంలో ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ నెంబర్1 గా ఉన్న చిరంజీవి బయోపిక్ గురించి నాగబాబు ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఏ బయోపిక్ అయినా, ఉన్నది ఉన్నట్లుగా తీస్తేనే అది బయోపిక్ అవుతుందని, ఫేబ్రికేట్ చేస్తే అది పురాణం అవుతుందని అన్నారు. కథానాయకుడు, యాత్ర సినిమాలను చూడలేదని, త్వరలో విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై నమ్మకం కలుగుతుందని అన్నారు.

ఎన్టీఆర్ కెరీర్‌లో వర్మ ఇంటరెస్టింగ్ పాయింట్ తీసుకొని సినిమా రూపొందించారని కాబట్టి సినిమా ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉందని అన్నారు. ఇక చిరంజీవి బయోపిక్ తీసే ఆలోచన తనకు లేదని, రామ్ చరణ్ కి కూడా ఉండి ఉండదని అన్నారు. చిరంజీవి కూడా నా మీద బయోపిక్ తీస్తే బావుండని అనుకునే మనిషి కాదని, ఆయనకి సెల్ఫ్ ప్రమోషన్ నచ్చదని అన్నారు.

మామాట: అంటే చిరంజీవి బయోపిక్ లేనట్టే…

Leave a Reply