జబర్దస్త్ నుంచి నాగబాబుతో పాటు మూడు టీంలు ఔట్…

nagababu and three teams out of jabardasth program
Share Icons:

హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న జబర్దస్ట్ ప్రోగ్రాం ఇప్పుడు సంక్షోభంలో పడింది. ఆ కార్యక్రమం నుంచి పాత డైరక్టర్లు బయటకు వచ్చేయడంతో వివాదం రేగింది. షోని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తానని చెప్పిన జబర్దస్ట్ జడ్జీగా ఉన్న నాగబాబు కూడా బయటకొచ్చేసినట్లు తెలిసింది. తాజాగా దీని గురించి చమ్మక్ చంద్ర క్లారీటీ ఇచ్చాడు. ఈ షో నుంచి నాగబాబు బయటికి వచ్చిన మాట వాస్తవమే అని అసలు నిజం బయటపెట్టేసాడు.

ఆయనతో పాటే తాము కూడా బయటికి వచ్చినట్లు కన్ఫర్మ్ చేసాడు చంద్ర. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగబాబుతో పాటు చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, హైపర్ ఆదితో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా బయటికి వచ్చేసింది. అయితే జబర్దస్త్ అనేది మా లైఫ్ అంటున్నాడు చంద్ర. అదెప్పుడూ తమకు లైఫ్ ఇచ్చిన షో అని.. ప్రస్తుతం సరదాగా బయటికి వచ్చేస్తున్నాం కానీ త్వరలోనే మళ్లీ వెళ్తామేమో చెప్పలేం అంటూ క్లారిటీ ఇచ్చాడు ఈయన. దాంతో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలకు ఎండ్ కార్డ్ పడిపోయింది. స్వయంగా చమ్మక్ చంద్ర క్లారిటీ ఇవ్వడంతో జబర్దస్త్ కామెడీ షో నుంచి కొన్ని టీమ్స్‌తో పాటు నాగబాబు కూడా బయటికి వచ్చేసాడని అర్థమైపోయింది.

ఇక నాగబాబు బయటకొచ్చేయడంతో గురువారం వచ్చే జబర్దస్త్‌కు సాయి కుమార్‌ను, శుక్రవారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌కు ఆలీని అనుకుంటున్నట్లు టాక్. వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారని తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారని వినికిడి. సాయి కుమార్ , ఆలీ ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ గనక జడ్జి స్థానంలో వస్తే ఎలా హ్యాండిల్ చేస్తాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా నాగబాబు నవ్వులు లేని జబర్దస్త్‌ను ఊహించుకోవడం కష్టమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ టీమ్‌లకు ప్రధాన ఆకర్షణగా ఉన్న వీళ్లంతా వెళ్లిపోతే, ఆ షో పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది. ఏడేళ్లు పూర్తి చేసుకోనున్న ఈ కామెడీ షో నుంచి మెయిన్ రోల్స్ తప్పుకోవడం వల్ల షో కళ తప్పుతుందా? లేక మునుపటి జోష్‌లోనే ఉంటుందా? అన్నది ప్రశ్నగా మిగిలింది.

Leave a Reply